|| ఋణానుబంధం ||నాకు బాగాగుర్తు
నన్ను ఒల్లో కుచ్చోబెట్టుకుని 
నాన్నమీసం నువ్వు దువ్వుతుంటే 
నా బోడిమూతిమీద  నీకాటుక 
మీసంలా రాసుకొచ్చి 
నాకూ దువ్వమని మూతి చూపిస్తే 
నన్ను ముద్దేట్టుకున్నావ్ కదా 

ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నానంటే  
నేనింకా చిన్నపిల్లోన్నేకదమ్మా 

చానాల్లకి నీ చెతివంట తిన్నాక 
మొదటిముద్ద  కారంగా ఉన్నా 
రెండోముద్ద  కమ్మగా మారిపోతుంది 
అమ్మవికదా  అందుకేనేమో !
మూడోముద్దకి మమకారం కలిపెట్టావా ఏంటి 
కన్నీళ్లు కారుతున్నాయి 
 
పిచ్చితల్లీ 

కారమెక్కువైందని  నువ్వు కళ్ళు తుడుస్తుంటే 
మమకారమెక్కువైందని నానా కనిపెట్టేసాడు 

మీప్రేమిలా పెరిగిపోతుంటే 
మీకు మరీ ఋణపడి పోతున్నానా?
ఈ ఒక్కజన్మకీ బిడ్డనై  పుట్టిన రుణాన్ని 
వీలైతే  వేలజన్మలదాకా సేవచేసి 
వడ్డీ కాస్త  తీర్చుకుంటాను  

ఈ ణానుబంధాన్ని  
అసలైన ప్రేమనీ అర్ధం చేసుకోవడానికి 
పాతికేళ్ళు  పట్టిందంటే 
ఎదుగుతూ ఎక్కడో తప్పుటడుగులేసానా?

31.12.2012

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు