||లెక్క||


కావాల్సినదేదో అదే చూడు
కనబడిందంతా కలిపేసుకో
కూడుకోసం కూడబెట్టు
కూడిక చేస్తూ !

నచ్చనిదేదో నీనుంచి తీసి
మైనస్ గుర్తు వాటి మొహంమ్మీద రాసి
నువ్వు నీకు మిగిలేందుకు
తీసివేతే చెయ్

పనికొచ్చేదా?
అయితే దాన్ని హెచ్చవేసి రెచ్చగొట్టి
పెంచేస్తూనో,పెరిగిపోతూనో
నువ్వు చేసేది ఘనకార్య గునకారమే

ఒకచేవిలో విభాగిని
మరోచెవి కాళీ ఎందుకు?
విభాజకం వెయిటింగిక్కడ
నీకిచ్చినదాన్ని అట్టిపెట్టాక
బతికినదంతా భాగఫలం అయితే
చివరికి మిగిలిందాన్ని శేషం అనేయ్
బతుకు భాగాహారం బాలేక పొతే
శేషం సున్నా వస్తది జాగ్రత్త !
-కాశి రాజు

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు