పోస్ట్‌లు

November, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

||లెక్క||

కావాల్సినదేదో అదే చూడు
కనబడిందంతా కలిపేసుకో
కూడుకోసం కూడబెట్టు
కూడిక చేస్తూ !

నచ్చనిదేదో నీనుంచి తీసి
మైనస్ గుర్తు వాటి మొహంమ్మీద రాసి
నువ్వు నీకు మిగిలేందుకు
తీసివేతే చెయ్

పనికొచ్చేదా?
అయితే దాన్ని హెచ్చవేసి రెచ్చగొట్టి
పెంచేస్తూనో,పెరిగిపోతూనో
నువ్వు చేసేది ఘనకార్య గునకారమే

ఒకచేవిలో విభాగిని
మరోచెవి కాళీ ఎందుకు?
విభాజకం వెయిటింగిక్కడ
నీకిచ్చినదాన్ని అట్టిపెట్టాక
బతికినదంతా భాగఫలం అయితే
చివరికి మిగిలిందాన్ని శేషం అనేయ్
బతుకు భాగాహారం బాలేక పొతే
శేషం సున్నా వస్తది జాగ్రత్త !
-కాశి రాజు

||నా ఫ్రెండంటే||

దేవుడొస్తే
నాక్కనిపిస్తే
ఒకవేళ వరంగాని ఇస్తానంటే
నీకేంకావాలో కోరుకొమ్మంటే
నాకొన్ని చోయస్లిస్తే

నిన్ను తీస్కెల్లి
అతనిముందు నిలబెట్టి
ఈడికన్నా గొప్పోడు
ఈడికన్నా మంచోడు
ఎట్లీస్ట్ ఈళ్ళాంటోడు
ఎవడన్నా వుంటే
వాన్ని నువ్వే తీసుకో
ఎందుకంటే
నాకీడున్నాడని నీకు తెలుసు
మరి నీకో?
అందుకే సెప్తున్నా!
కన్ప్యూజౌతావేమో అని
తీస్కొచ్చికూడా సూపెట్టా
ముల్లోకాలే ఎతుకుతావో
సప్తసముద్రాలే దాటుతావో
నీ ఇష్టం
ఆల్ ద బెస్ట్!
అని సెప్తాను
************
||అహం బ్రహ్మస్మి ||

పుట్టింది మొదలు
గిట్టేవరకూ
నువ్వెంత రూపాంతరం చెందినా
నాకు నచ్చుతావ్ చూడు
నేను అప్పుడు "అమ్మ"ని

బరువు మోయడం
భాధ్యతని ఎరిగి
భుజం మోపినపుడు
భారం తగ్గిన "తండ్రి"ని

బ్రహ్మ,విష్ణు , మహేశ్వరుల
కరువైన కర్మ సిద్దాంతాన్ని
గుట్టురట్టు చేస్తూ నేను దాన్ని భోదిస్తానా
నేను "గురువు"ని

సాంతం తప్ప మరేరసమూ తెలియని స్థితిలో
నవ్వుతూనో ,నాలుకతీసి ఎక్కిరిస్తూనో
నేను "పిల్లవాన్ని"

యవ్వనాలన్నీ పువ్వులై
పరిమళిస్తుంటే
ముక్కు మూసుకుని నాదారిన నేను నడుస్తానా!
నేను "యువకున్ని"

మనసు ముద్రించుకున్న జీవితాలు కొన్ని
సంపుటులుగా చదువుతూ
జీవించడాన్ని నేర్చుకుంటానా!
నేను "విద్యార్ధిని"

పనియే దైవమని నమ్మి
దైవత్వాన్ని దరిస్తానా!
నేను "ఉద్యొగి"ని

అర్దనారీశ్వర తత్వానికి
అర్ధమే తెలియకున్నా
అర్ధబాగాన్ని అర్పించినపుడు
"అర్దాంగి"ని

శృంగారం, దైవం సమానమనినమ్మి
సంసార కార్యాలు చేస్తున్నప్పుడు
నేను బాధ్యతని, "భర్త"ని

తమలపాకులాంటి తనువొకటి
తళ తళా మెరుస్తూ
తనువే తామ్బూలమైంది
తిను అన్నప్పుడు
నేను బోజనప్రియున్ని

ఇచ్చినవన్నీ చాలవన్నట్లు
అ…

|| ప్రేమా ,నేను ||

నీ గురించి యోచిస్తూ
నీ అసలు శోభను
నా మనోనేత్రం తో చూద్దామనే ప్రయత్నంలో నేను
ఆ మనో నేత్రాన్ని కూడా కనురెప్పగా మూస్తూ ,తెరుస్తూ నువ్వు !

రాత రాసి
గీత గీసి
కదలల్లి , కవిత్వాలు చల్లి

నిన్ను చదువుతూ నేను ,
ఇంకా కొంత మిగిలి పోతూ నీవు

అందంగా అబద్దాలు
అల్లుతూ నేను
అవే నచ్చుతూ ఉండి
మెచ్చుకోలుగా నీవు!

అందాన్ని అందంగా అందించడం
అందరికీ నేర్పుతూ నీవు ,
అందులో నేనే మొదతోడిననే అనుమాన భావంతో నేను

రాలిన గింజ, మోలుస్ద్తున్న మొక్క
విరుస్తున్న పువ్వూ ప్రేమే ,
వీస్తున్న గాలి , నన్ను తాకే చలి
పక్కన నా చెలీ ప్రతీదీ ప్రేమే !

ఓ ప్రేమా!
నువ్వే ప్రాణమై
నా ప్రతి కణంలో నిండిపోతుంటే
నీతో నేను జీవించడం తప్ప
నీకేమీ చేయని నిస్సహాయ స్తితి నాది
సరిగా గమనించు మరి

||మార్పు ||

ఎంతటి రూపంతరమంటే
నిన్న శరీరం , ఈ రోజుదాకాలేదు
ఏదో మార్పు

నిక్కరు నుండి ప్యాంటుదాకా
నాకు తెలిసీ,తెలియకుండానే

కానీ
అదే ఆత్మ

మళ్ళీ చిన్న సందేహం
నిర్మలమైనది నిలకడలేనిదైపోయిందేమో! అని

ఒక మార్పు
అల్లరి.అమాయకత్వం నుండి
ఆత్మశుద్ది,ఆత్మాభిమానమ,ఆత్మబలం,ఆత్మవిశ్వాసం
అనే నాలుగు స్తంబాలనేసుకుని నాముందు నిలబడింది

ఆ మార్పే
కొంత కాలాన్ని కవితగా
నా ఖాతాలో జమచేస్తుంది
అది కూడా గాడార్దాలతోనో,గూడార్దాలతోనో
మార్పుకు లోనౌతుంటుంది

ఒక మార్పు
కాలంలోని క్షణాలన్నీ క్రమబద్దంగా మారుస్తూ
ఈ నిమిషం బతుకు సుఖమనే భావన నాతో బలవంతంగా మోయిస్తూ
కాలమే మార్పు చెందుతుందనే నిజాన్ని
నాతో చెప్పకనే చెప్పి
మార్పు చెందుతూనే ,అంటే మనిషిలాగానే బతకమని
ఓ ఉచిత సందేశాన్ని ఇస్తుంది .

||అక్షరయానం ||

“అ” వెళ్లి “అహా” మీద వాలుదామని
అచ్చులాంటి కవితై
“క” నుండి “క్ష” వరకూ హల్లుల దారిగుండా ప్రయాణిస్తుంటే
జిత్తులమారి వత్తులు చేరి
గుణింతాలతో చుట్టూ గుమిగూడాయి

ద్విత్వాక్షరాలు,సంయుక్తాక్షరాలు
సందుల్లోకి రమ్మని సైగ చేస్తుంటే

సమాసాలు ఏకంగా సంగామిద్దాం రమ్మంటున్నాయి
అర్దాలూ,ప్రతిపదార్ధాలు
నానార్దాలను నాటుతున్నాయి...............

ఎక్కడా తలెత్తకుండా
ముందుకు సాగుతూ ఉంటే
పదాలుకొన్ని ఊరికే పలకరిస్తున్నాయి
వాక్యాలు వరసలు కలుపుతున్నాయి

అయినా సరే
ప్రయాణిస్తూ పేరాదాకా చేరింది పాపం
పేరాలన్నీ కలిసి పేజీఅయ్యేసరికి,
పేజీతో రాజీ పడక తప్పదని
అక్షరం అక్కడే ఆగిపోతే
దాన్ని కలుపుకున్న పేజీ మాత్రం
క్రేజీగా పెరిగిపోతూ పుస్తకమై
ప్రపంచ పర్యాటన చేసేద్దాం పద అని అక్షరాన్ని అడుగుతుంది......