|| భూమ్యాకాశం ||


వాళ్ళిద్దరినీ ఎప్పటినుండో చూస్తున్నాను

ఎవరు వాళ్ళు ?

ఎప్పుడూ ఒకరివైపొకల్లు అలాగే చూసుకుంటారుఅతను ఎంత ప్రశాంతంగా ఉంటాడో !

అందమైనోడు కూడా

స్వచ్చమైన మనసు పైకి కినిపిస్తూనే ఉంటుంది.

అప్పుడపుడూ అవసరమనుకున్న

మొహమాటపు మబ్బులు కప్పుకుంటాడుఆమె చాలా ఓపిగ్గలది

పచ్చ చీర కట్టుకుని ముచ్చటగా కనిపిస్తుంది.వారి ఇరువురి సంబందం ఏమిటో అని

వాళ్ళకైనా తెలుసో లేదో అని అనుకుంటానుఒకరు పైన

ఒకరు కింద

ఎప్పుడూ అదే తీరు

ఎవరూ మారరు.ఒక్కోసారి ఏమవుతుందో తెలీదు

ఆమె వైపు ఉరిమి చూస్తాడు

తను బెదిరిపోతూ , అతనివైపు భయంగా చూస్తుంది

అతడు కరిగిపోతాడేమో!

కొన్ని చెమట చుక్కల్లాంటివి ఆమె నుదుటిపై కురుపిస్తాడుఅవిఎత్తైన

ప్రదేశాలగుండా ప్రవహించి

ఆమెలోని పల్లుపు ప్రాంతాల్లోకి చేరుతాయిఆ స్వేదాస్కలనంతో సేదతీరుతారుకాబోలు

ఇద్దరూ కొద్దిసేపు ప్రశాంతంగా కనిపిస్తారుఆమె కావాలని కలగజేసుకుని

ఎన్నాళ్ళిలా విడిగా ఉంటాం

మనం కలిసిపోదామా అని అడుగుతుంది

దానికతడు ఎటకారాన్ని ఎరువట్టుకొచ్చి

“ఒసేయ్ తల్లి పీనుగా

మనం కలిస్తే మన బిడ్డలెట్టా బతుకుతారే?

మనసంగమం సాద్యం కాదుగాని

మనమిలాగే ఉందాం

మనబిడ్డల్ని చూసుకుందాం” అంటాడు

ఆమె సరే అని సమాదానపడుతూ

సహృదయంతో అతనికేసి చూస్తుంది .

ఇవన్నీ గమనిస్తూనే

వాళ్ళిద్దరి సంబంధం ఏదైతే నాకేంటి

నాకు వాళ్లకి సంబంధం ఏమిటి

అని ఆలోచిస్తూ ఉంటాను

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు