కనీసం
నడుస్తూనో నటిస్తూనో కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం ఇంకా కుదిరితే అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం ముడివేయబడొద్దని నువ్వో, ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం. ఇంకా కుదిరితే ... నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా